Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

పదవ తరగతి సోషల్ లోను యుటిఎఫ్- ఎస్ఎస్సి మెటీరియల్ ప్రభంజనం..

యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు సెట్టీపీ జయ చంద్రారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: పదవ తరగతి సోషల్ ప్రశ్న పత్రంలోనూ యుటిఎఫ్ మెటీరియల్ ప్రభంజనం సృష్టించిందని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు సెట్టిపి జయ చంద్ర రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అన్ని సబ్జెక్టులలో 65 నుండి 79 శాతము స్కోరు చేసే విధంగా యుటిఎఫ్ మెటీరియల్ నుండి ప్రశ్నలు రాగా చివరిగా నేడు జరిగిన సోషల్ పరీక్షల్లో 84 మార్కులకు ప్రశ్నలు వచ్చి విద్యార్థులందరినీ కూడా సంతోషపరిచాయని తెలిపారు. సోషల్ ప్రశ్న పత్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మెటీరియల్ నుండి ఛాయిస్తో కలుపుకుంటే 94 కు పైగా మార్కులు రావడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. సోషియల్ ప్రశ్న పత్రం తయారు చేసిన కె. ఎస్. వి. కృష్ణారెడ్డికి వారికి అభినందన శుభాకాంక్షలు అని తెలిపారు. విద్యార్థుల కోసం అతి తక్కువ ఖర్చుతో ఎంతో ఉపయోగకరమైన మోడల్ పేపర్లను అందించిన యుటిఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ హనుమంతరావుకు, కన్వీనర్ కే.ఎస్. ఎస్. ప్రసాదు కు, ప్రచురణల కమిటీ సభ్యులు రాజశేఖర్, గోపాలకృష్ణకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img