Monday, May 20, 2024
Monday, May 20, 2024

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే లయన్స్ క్లబ్ ముఖ్య లక్ష్యం..

అధ్యక్ష కార్యదర్శులు గూడూరు మోహన్ దాస్, కార్యదర్శి రాజగోపాల్

విశాలాంధ్ర -ధర్మవరం ; పేద ప్రజలందరికీ కంటి వెలుగును ప్రసాదించడమే లయన్స్ క్లబ్ యొక్క ముఖ్యము అని లయన్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు గూడూరు మోహన్ దాస్, రాజగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉచిత కంటి చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ముఖ్యఅతిథిగా వన్ టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం, సభా నిర్వహణను లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు వెంకటస్వామి హాజరవుతున్నట్లు వారు తెలిపారు. క్యాంపు దాతగా నారాయణరెడ్డి, వీరి భార్య కీర్తిశేషులు ఇంటూరి సరోజమ్మ జ్ఞాపకార్థం వ్యవహరిస్తారని తెలిపారు. ముఖ్య వక్తగా క్లబ్బు చార్టర్ నెంబర్ పళ్లెం వేణుగోపాల్ తో పాటు క్లబ్ సభ్యులు కూడా పాల్గొంటారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా నియమావళిని పాటించాలని, జ్వరము జలుబు ఆయాసము గుండెదడ ఇతర ఆపరేషన్లో చేయించుకున్న వారు క్యాంపులో పాల్గొన రాదని తెలిపారు. ఈ శిబిరంలో కంటి వైద్య చికిత్సలు పొందిన తర్వాత ఆపరేషన్కు ఎంపికైన వారిని లయన్స్ కంటి ఆసుపత్రి యందు కంటి వైద్య నిపుణులు ఎన్. కిరణ్ కుమార్ చే ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించబడును తెలిపారు. అదేవిధంగా బీపీ షుగర్ ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకున్నచో ఐఓఎల్ ఆపరేషన్లు ఉచితముగా చేయుటయే గాక మూడుసార్లు చెకప్ తో పాటు కంటి అద్దములు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. శిబిరానికి వచ్చువారు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మూడు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్, ఫోన్ నెంబర్ తో కూడినటువంటి చిరునామాను సమర్పించాలని తెలిపారు. దగ్గర చూపు దూరపు చూపు ఉన్న వారికి కంప్యూటర్ ద్వారా ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంట లయన్స్ కంటి ఆసుపత్రిలో ఖచ్చితమైనటువంటి అద్దములు పొందే అవకాశం ఉందని తెలిపారు. కావున ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గ్రామీణ పట్టణ, ప్రాంత పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని, కంటి వెలుగును పూర్తి దశలో పొందే అవకాశం ఉందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img