Monday, May 20, 2024
Monday, May 20, 2024

ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయం

వన్టౌన్ సిఐ. సుబ్రహ్మణ్యం
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాల ఏర్పాటు చేయడం అభినందినీయమని వన్టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా సబ్ జైలు సమీపంలో పుట్టపర్తి రోడ్డు నందు ఈ ఎస్ వి ఆర్ సేవా ట్రస్ట్ వారి సహకారంతో, అంజన శక్తి పశువుల ధానావారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటుకు వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా సిఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పట్టణంలో నాడు వేడి అధికంగా ఉందని, వేసవికాలం మరో రెండు నెలలు ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని, వీరిని స్ఫూర్తిగా తీసుకొని, పట్టణంలో మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని కూడా తీర్చాలని తెలిపారు. పట్టణానికి ఎంతోమంది వివిధ పనుల మీద వస్తుంటారని, అలాంటి వారికి ఈ చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడటంతో పాటు దాహార్తిని తీర్చుతుందని తెలిపారు. ఈ చలివేంద్ర ఏర్పాటు నిర్వాహకులను సీఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈఎస్విఆర్ సేవా ట్రస్ట్ కార్యదర్శి ప్రతాపరెడ్డి, శ్రేయోభిలాషులు, స్నేహితులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img