Friday, May 10, 2024
Friday, May 10, 2024

జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ధర్మవరం బాలబాలికల ఎంపిక…

ధర్మంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ సెట్టిపి జయచంద్రారెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ ప్రాపబుల్స్ జట్లకు ధర్మవరం బాల బాలికలు ఎంపిక కావడం జరిగిందని ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సెట్టీపీ జయ చంద్ర రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయస్థాయిలో ఏప్రిల్ 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు పాండిచ్చేరి రాష్ట్రంలో రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం లో జరిగే 38వ యూత్ నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాల బాలికల జట్ల ఎంపిక మార్చి 28 నుండి ఏప్రిల్ ఏడవ తేదీ వరకు చిత్తూర్ నగరంలో జరిగే కోచింగ్ క్యాంపుకు ధర్మవరం పట్టణానికి చెందిన బాలికల విభాగంలో సల్మా, కిరణ్మయి, బాలుర విభాగంలో విజైను ఎంపిక కావడం జరిగిందని వారు తెలిపారు. వీరు గతంలో ఉమ్మడి అనంతపురం బాస్కెట్బాల్ జట్టుకు ఎంపికై పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లో జరిగిన 26 జిల్లాల టోర్నమెంట్ లో రాణించారని తెలిపారు. మరి ఈరోజు జాతీయ స్థాయిలో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ ప్రాప బుల్స్ కు ఎంపిక కావడం పట్ల అసోసియేషన్ అధ్యక్షుడు మేడాపురం రామిరెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, వాయల్పాడు హీదాయత్తుళ్ల ,కోచ్ సంజయ్, అసోసియేషన్ సభ్యులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడ కూడా జాతీయ స్థాయిలో రాణించి ధర్మవరం పట్టణానికి మంచి గుర్తింపు తీసుకొని రావాలని వారు ఆకాంక్షించారు. కేవలం ధర్మవరం పట్టణానికి చెందిన ముగ్గురు బాస్కెట్బాల్ క్రీడాకారులుగా ఎంపిక కావడం అర్షనీయమని మొత్తం 26 జిల్లాల నుండి ఎంపిక చేసిన ప్రాపబిల్స్ జట్టులో మన ధర్మవరం క్రీడాకారులు ముగ్గురు ఉండడం గర్వకారణం అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img