Monday, May 20, 2024
Monday, May 20, 2024

మత విభజనకుమోదీ కుట్ర

ఈఏసీ`పీఎం పత్రంపై డి.రాజా విమర్శ

న్యూదిల్లీ : జనాభాపై ఈఏసీపీఎం పత్రం ద్వారా మతపరమైన విభజన సృష్టించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. 19502015 మధ్య భారతదేశంలో హిందువుల జనాభా వాటా తగ్గిందని పేర్కొన్న నివేదికను అడ్డుపెట్టుకొని… బీజేపీ మతపరమైన విభజనకు ప్రయత్నిస్తోందని ఆయన గురువారం అన్నారు. జన గణన చేపట్టనందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ… ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీపీఎం) రూపొందించిన నివేదికను కలహాలు సృష్టించడం ద్వారా ఓట్లు పొందే ప్రయత్నంగా పేర్కొన్నారు. నివేదికకు సంబంధించిన సమయాన్ని రాజా ప్రశ్నిస్తూ...‘దేశం ఎన్నికలకు వెళుతున్న సమయంలో ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి ఈ నివేదికను ఎందుకు బయటపెట్టింది? ప్రధానమంత్రి ఇప్పటికే ముస్లింల పేరుతో ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తున్నారు. రామమందిర తాళాలు ముస్లింలకు అప్పగించడం గురించి మాట్లాడుతున్నారు. అటువంటి అంశాలన్నింటినీ ఆయన తీసుకుంటున్నారు. అంటే ఇలాంటి వివరాలు బయటకు తీసుకొచ్చి ప్రజలను విభజించే ప్రయత్నం జరుగుతోంది. ఇలాంటి నివేదికల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని అన్నారు. ‘ఇది 19502015 మధ్య జరిగిన అధ్యయనం. 2014లో మోదీ అధికారంలోకి వచ్చారు. ఈ ప్రభుత్వం ఎటువంటి జనగణన నిర్వహించలేదు. కోవిడ్‌ కారణంగా మరణించిన వారి గురించి ఎటువంటి వివరాలు ఇవ్వలేదు. వారు వలస కార్మికులు లేదా ప్రబలంగా ఉన్న పేదరికంపై ఎటువంటి వివరాలు అందించలేదు. అయితే ఈ వివరాలు ఎలా సేకరించారు?’ అని రాజా ప్రశ్నించారు. ఆర్‌జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ ఈ నివేదికపై మాట్లాడుతూ విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. ‘2020-21లో జరగాల్సిన జనాభా గణన ఇప్పటి వరకు జరగలేదు.
ఇది 2024… వారి లక్ష్యం దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడం, విద్వేషాన్ని వ్యాప్తి చేయడం మాత్రమే. ఇదీ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అజెండా. పదేళ్లుగా ఈ దేశ ప్రజలను మోసం చేశారు, మళ్లీ అదే చేయాలని చూస్తున్నారు’ అని ఆరోపించారు. కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు గిరిరాజ్‌ సింగ్‌ అదే సమయంలో కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ నివేదికను ఉపయోగించారు. దాని బుజ్జగింపు రాజకీయాల వల్ల దేశంలో హిందూ జనాభా తగ్గిపోయిందని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img