Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

వకృత్వ , వ్యాసరచన పోటీలో విజేతలకు నగదు బహుమతులు అందజేసిన ఏ.ఎస్పీ

విశాలాంధ్ర, సీతానగరం: మండలంలోని సీతానగరం పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పి. లావణ్య, స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఎస్ పల్లవిలు జిల్లా పోలీసు శాఖ నిర్వహించిన వకృత్వ, వ్యాస రచన పోటీలో విజేతలుగా నిలిచారు. హెడ్ కానిస్టేబుల్ లావణ్య జిల్లాస్తాయిలో “మహిళా భద్రతలో పోలీసు పాత్ర”అన్న అంశంపై నిర్వహించిన పోటీలో ప్రదమ స్తానంలో నిలవగా ఆమెకు 2వేలు నగదు బహుమతిని జిల్లా అదనపు ఎస్పీ దిలీప్ కిరణ్ చేతుల మీదుగా అందజేసి అభినందించారు. అదేవిధంగా స్తానిక ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని పల్లవి రాబోయే కాలంలో పోలీసుల పాత్ర అన్న అంశంపై వ్యాసరచన పోటీలో విజేతగా నిలవగా ఆమెకు 15వందలు నగదు బహుమతి జిల్లా అదనపు ఎస్పీ దిలీప్ కిరణ్ అందజేసారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సంధర్భంగా జిల్లా పోలీసు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పలు పోటీలు,కార్యక్రమాలు నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు. మండలంలో విజేతలుగా నిలిచిన లావణ్య, పల్లవిలను ఎస్ ఐ నీలకంఠం, పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఉన్నత పాఠశాల సిబ్బంది, తోటి విద్యార్థులు, మండల నాయకులు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img