Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఓటుహక్కు నమోదుకోసంవచ్చి స్పృహ తప్పి పడిపోయిన నిరుద్యోగి

విశాలాంధ్ర, సీతానగరం:గ్రాడ్యుయేట్ ఓటు హక్కు నమోదుకోసం సీతానగరం ఎంపిడిఓ కార్యాలయంకు వచ్చిన ప్రైవేటు జూనియర్ కాలేజి లెక్చరర్ ఒకరు అప్లికేషన్ నింపుతూ సృహతప్పి పడిపోయిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది.వివరాలు పరిశీలిస్తే మండలంలోని కొత్తవలస గ్రామానికి చెందిన తూపురు సింహాచలం పార్వతీపురంలోని ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. శుక్రవారం తన ఒరిజినల్ సర్టిఫికేట్లు, తనభార్య కొర్లాపు సీతాలక్ష్మి సర్టిఫికేట్లును తీసుకొని ఎంపిడిఓ కార్యాలయంకువచ్చి వాటిని చూపి రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దరఖాస్తులు తీసుకొని నింపుతుండగ స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే మండలపరిషత్ సిబ్బంది హుటాహుటిన ప్రక్కనేఉన్న ప్రభుత్వఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. వెంటనే వైద్యులు శిరీష, సిబ్బంది చికిత్స అర్ధగంటపాటుచేశారు. బిపి ఎక్కువగాఉండి, పెరాల్సిస్ స్ట్రోక్ లక్షణాలు కనిపించగా వెంటనే పార్వతీపురం ఆసుపత్రికి తరలించడానికి 108వాహనంకోసం 45నిమిషాలు చూసిన రాకపోవడంతో పాటు పేషెంట్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆటోలో అతన్ని పార్వతీపురం ఆసుపత్రికి రిఫర్ చేసి తరలించారు. ఈకార్యక్రమంలో ఈఓ పిఆర్డి వర్మ, మండల పరిషత్ సిబ్బంది నాని, శేఖర్, ప్రసాద్, దేవిలతోపాటు ఆసుపత్రి సిబ్బంది అతనికి సపర్యలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img