Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏనుగులదాడిలో మరొకరు మృత్యువాత

. ఇంతవరకు 8మంది మనుష్యులు, 18పశువులు మృతి
. ఇంకెన్ని ప్రాణాలు పోవాలి…?
. పరిహారం చెల్లింపులో తాత్సారమే!
. ఏనుగులతరలింపుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి: సీపీఐ, సీపీఎం, టీడీపి, జనసేన నాయకుల డిమాండ్

విశాలాంధ్ర,పార్వతీపురం: ఈప్రాంతంలో ఏనుగులకు అనుకూలమైన వాతావరణం, నీరు, పంటలుసమృద్దిగా ఉండటంతో
అవి ఈమైదానప్రాంతాలను అటవీస్తావరాలుగా చేసుకొని 2017నుండి పార్వతీపురం మన్యంజిల్లాలో తిష్టవేసి ప్రజలను, వారిపంటలను, పశుసంపదను నాశనంచేస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పొలానికినీరుకడుతున్న కొమరాడమండలంలోని కళ్ళికోట గ్రామానికిచెందిన దాసరి గోవింద్( 55) అనే “రైతును”హరిఅనే పిలవబడే పెద్దఏనుగు తొక్కిచంపింది. దీంతో ఇంతవరకు 7మంది మనుష్యులను, ఒక అటవీశాఖలో పనిచేస్తున్న ట్రేకరును, 18పశువులనుఏనుగులు పొట్టన పెట్టుకున్నాయి. మరికొంతమందిని గాయ పరిచాయి.ఎన్నోవేల ఎకరాల పంటనష్టాన్ని నష్టపరిచాయి.రైతుల పంటలే కాకుండా వారిబోరుబావులు, మోటార్లుతదితర సామాగ్రినికూడా ఏనుగులు తొక్కిపెట్టిన సంగతి తెలిసిందే.ఎక్కువనష్టం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలోని కొమరాడ మండలంలో జరగడంగమనార్హం. మనుష్యులు, పశువులు ఎక్కువగా
ఈమండలంనుండే మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఏనుగులవల్ల తీవ్రనష్టం జరిగిందని,పంటలను ఏనుగులు తొక్కిపెట్టి నాశనంచేసిన పంటనష్ట పరిహారంకోసం కార్యాలయాలచుట్టూ తిరగడమేతప్ప వందలాదిమందిరైతులకు ఇంతవరకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదని పలువురు రైతులు చెబుతున్నారు. నష్టంజరిగిన దాటిలో అధికార్లు చెల్లించేది చాలా చాలా స్వల్పమని పలువురు రైతులు చెప్పారు. 2017లో ఏనుగులు ప్రవేశం తరువాత వీటివల్ల పడేబాధలు వర్ణనాతీతమని పలువురు రైతులు కంటతడిపెట్టి చెప్పారు.ప్రకృతివల్ల కొంతపంట నష్టపోతే వీటివల్ల మిగిలిన కొంతనష్ట పోతున్నట్లు చెప్పారు. తక్షణమే ఏనుగులతరలింపు ప్రక్రియ నిర్వహించాలి: పార్వతీపురం మన్యం జిల్లాలో గతఏడేళ్లుగా తిష్టవేసి రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్న ఏనుగుల గుంపును తక్షణమే తరలించే చర్యలు తీసుకోవాలని సీపీపి,సీపీఎం, టీడీపి,జన సేన పార్టీలనాయకులు డిమాండ్ చేశారు.శనివారం వారంతా మృతిచెందిన రైతుకుటుంబాన్ని పరామర్శించి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక జిల్లాఆసుపత్రిఎదుట కొమరాడ మండల నేతలంతా నిరసన కూడా చేపట్టారు. మృతుని కుటుంబానికి 50లక్షల నష్టపరిహారం, కుటుంబ సభ్యులలో ఒకరుకు ఉద్యోగంఇవ్వాలని సీపీఐ ప్రదాన కార్యదర్శి కోరంగి మన్మదరావు,జీవన్, సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి వేణు, సాంబమూర్తి, టిడిపి నియోజకవర్గ ఇంచార్జి తోయక జగదీశ్వరి,శనపతి శేఖర పాత్రుడు, జనసేన నేతలు పాలోరుబాబు , వంగలదాలి నాయుడు తదితరులు డిమాండ్ చేశారు. ఇదే సందర్భంలో రైతు మృతికి సంతాపం తెలిపేందుకు వస్తున్న మాజీమంత్రి,ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజును, టీడీపి నేతలను గరుగుబిల్లి పోలీసులు అడ్డుకున్నారు. గత ఏడేళ్లగా జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. మృతునికి ఐదులక్షల నష్టపరిహారం చెల్లిస్తాం: జిల్లాఅటవీఅధికారి ప్రసూన
ఏనుగుదాడిలో మరణించిన కల్లికోటరైతు దాసరి గోవింద్ కుటుంబానికి ఐదులక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇస్తూ అతని కుమారుడుకి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని జిల్లాఅటవీ అధికారి ప్రసూన, అటవీ రేంజర్ త్రినాథనాయుడులు తెలిపారు. జిల్లా ఆసుపత్రివద్ద కుటుంబ సభ్యులు, వివిదపార్టీల నాయకులు నిరశన చేయగా అక్కడికివచ్చిన వారు ప్రకటన చేశారు.ఇంతవరకు 2018-, 19నుండి 2434మంది రైతులకు 2517హెక్టార్ల పంటలకు కోటి 58లక్షల 55వేల రూపాయలు చెల్లించినట్లు చెప్పారు. రాష్ట్ర, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఏనుగుల తరలింపు ప్రక్రియ కోసం ఒక టీమ్ అధికారులు ఈనెల 23తరువాత ఉత్తరాంచల్ వెళ్తుందని తెలిపారు. ఆరునెలల సమయం పడుతుందని, కనీసం 3కోట్ల రూపాయలు నిధులు అవసరమని చెప్పారు. చందలింగి దగ్గర పునరావాస కేంద్రాన్ని ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img