Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఈనెల 17నుండి సంకిలిలో చెరకుగానుగ ప్రారంభం

. టన్నుకు రైతుకు చెల్లించేధర రూ.2793లు
. 5.85లక్షల టన్నుల చెరకు గానుగలక్ష్యం
. మొక్క, మమ్ముతోటలకు పలురాయితీలు
. ఐఐడి ప్యారీ కర్మాగార ఏజిఎం అప్పారావు వెల్లడి

విశాలాంధ్ర, సీతానగరం: ఈనెల 17నుండి సంకిలి ఐ ఐ డి ప్యారీ (ఇండియా) లిమిటెడ్ లో చెరకు గానుగ ప్రారంభం చేస్తామని కేన్ జనరల్ మేనేజర్ అప్పారావు విలేకరులకు వెల్లడించారు.శనివారం సాయంత్రం సీతానగరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టన్నుకు ప్రభుత్వం నిర్ణయించిన ధర 2980, టన్ను ఒక్కింటికి రాయితీ 93రూపాయలు కలిపి 3073రూపాయలకుగాను టన్ను చెరకుకు రవాణా ఖర్చులు 273రూపాయలు, నిర్వహణ ఖర్చులు 3రూపాయలు, సిడిసి ఖర్చులు 4రూపాయలు కలిపి 280 తీసివేసి టన్నుకు రూ.2793లు నికర
పేమెంటు చేస్తామని చెప్పారు. దీనిలో డీజిల్, పెట్రోల్ ధరలు బట్టి రవాణా ఖర్చులు తగ్గడం, పెరగటం ఉంటుందని తెలిపారు. దీంతో పాటు లోడింగు ఖర్చులు కూడా ఉంటాయని చెప్పారు. గతఏడాది రైతులకు టన్ను ఒక్కింటికీ 2742రూపాయలు చెల్లించినట్లు చెప్పారు. గత ఏడాది కర్మాగారంలో 5లక్షల నాలుగు టన్నుల చెరకు క్రషింగు చేయగా ఈఏడాది 5.85లక్షల టన్నుల చెరకు లక్ష్యంగా చేసుకుని గానుగ ప్రారంభం చేస్తామని చెప్పారు. గతఏడాది ఎన్ సి ఎస్ చక్కెర కర్మాగార పరిధినుండి 90వేల 4టన్నుల చెరకు క్రషింగుకు రాగా,ఈఏడాది లక్షా 10వేల టన్నులచెరకు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. బీమసింగి నుండి గత ఏడాది 21వేయిటన్నుల చెరకురాగా,ఈఏడాది 18వేల టన్నుల చెరకు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. తమ కర్మాగార పరిధిలోని చెరకు పంట పెంచడంతో పాటు ఎన్ సి ఎస్ చక్కెర కర్మాగార పరిధిలోని చెరకు విస్తీర్ణం పెంచడానికి కూడా యాజమాన్యం రైతులకు పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటన చేసినట్లు చెప్పారు. క్రొత్తగా చెరకునాటిన రైతులకు, మమ్ము రైతులకు వర్తిస్తాయని చెప్పారు. మరిన్ని వివరాల కొరకు దగ్గరలో ఉన్న ఫీల్డ్ సిబ్బందిని సంప్రదించాలని కోరారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలు ద్వారా చెరకు కొనుగోలు చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలో కొనుగోలు కేంద్రాల వివరాలు పూర్తిగా వెల్లడి చేస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img