Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గుచ్చిమిలో కుటుంబవైద్య విధాన కార్యక్రమం

విశాలాంధ్ర,సీతానగరం: మండలంలోని గుచ్చిమి గ్రామంలో శనివారం కుటుంబ వైద్య విధానం,ప్రపంచ న్యుమోనియా దినోత్సవం కార్యక్రమాలను నిర్వహించగా జిల్లా ఇమ్యునైజేషన్ ఇంఛార్జి అధికారి 
(డి.ఐ.ఒ) డాక్టర్ టి. జగన్మోహనరావు సందర్శించి ఈన్యుమోనియా వ్యాధిపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఐదేళ్లలోపు పిల్లల్లో ఈవ్యాది నివారించేందుకు ప్రభుత్వం సాన్స్ ప్రోగ్రాం ప్రవేశ పెట్టిందన్నారు. ఈప్రోగ్రాంద్వారా వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో ఐదేళ్లలోపు పిల్లల గ్రహ సందర్శనలుచేసి ఈ వ్యాది లక్షణాలను గుర్తించాలన్నారు. తద్వారా వారికి త్వరితగతిన చికిత్స అందించడం ద్వారా వ్యాదితీవ్రతను తగ్గించ వచ్చునని చెప్పారు.వ్యాదిలక్షణాలుగా శ్వాసఎక్కువ సార్లు త్వరగాతీసుకోవడం, శ్వాస తీసుకునేటప్పుడు డొక్కలుకడల్చడం, గురక పెట్టడం , అధికజ్వరం, జలుబు, దగ్గు మొదలగుననవని చెప్పారు.ఈసాన్స్ ప్రోగ్రాం ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని  శిశుమరణాలను నివారించడమే ఈ ప్రోగ్రాం ముఖ్యఉద్దేశ్యమనీ డిఐఒ తెలిపారుఈకార్యక్రమంలోసీతానగరం
పి హెచ్ సి వైద్యాధికారులు డాక్టర్ శిరీష, ఉషారాణి, సూపర్ వైజర్ భవాని, వైద్య సిబ్బంది, 104 సిబ్బంది దుర్గారావు, ప్రసాద్, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img