Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సోమవారంనాడు కోవిడ్ మెగా వాక్సిన్ డ్రైవ్: జిల్లావైద్య ఆరోగ్యశాఖాధికారి

విశాలాంధ్ర,పార్వతీపురం/పాలకొండ:సోమవారం నాడు మన్యం జిల్లా పరిధిలో కోవిడ్ మెగా వాక్సిన్ డ్రైవ్ నిర్వహించాలని జిల్లావైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. జగన్నాథరావు తెలిపారు. శనివారం నాడు ఆయన పాలకొండమండలంలోని అన్నవరం ప్రాధమిక ఆరోగ్యకేంద్రాన్ని, పార్వతీపురం మండలం చినమరికి, కృష్ణపల్లి గ్రామాలను తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, ఇమ్మ్యునైజేషన్, వాక్సిన్ అందుబాటు తదితర అంశాలను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం కోవిడ్ మెగా వాక్సిన్ డ్రైవ్ నిర్వహించుటకు చర్యలు తీసుకోవాలని కోరారు.అన్ని పి.హెచ్.సిల స్థాయిలో వాక్సిన్ డ్రైవ్ జరగాలని స్పష్టం చేశారు. సాధారణటీకా కార్యక్రమాన్ని కూడా లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అంటువ్యాధులు, అంటువ్యాధులుకాని బి.పి, సుగర్ వంటి వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని, సర్వే చేయాలని ఆదేశించారు. మాతా, శిశు నమోదు కార్యక్రమంలో మెరుగైన పనితీరు కనిపించాలన్నారు.కుటుంబ వైద్యుడు విధానంలో ఎం.పి.హెచ్.ఏ లకు  సచివాలయాలను మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. డీ వార్మింగ్ కార్యక్రమంలో చిన్నారులకు డీ వార్మింగ్ మాత్రల పంపిణీని పరిశీలిస్తూ అనారోగ్యానికి మూలకారణం నులిపురుగులేనని చెప్పారు. వైద్య సిబ్బంది పూర్తి అప్రమత్తంగాఉండాలని, ఎక్కడా డెంగ్యూ, మలేరియా కేసులు రాకుండా చూడాలని చెప్పారు. పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, తాగునీటిని బాగా మరిగించి చల్లార్చి తాగాలని ఆయన సూచించారు.
ఈకార్యక్రమంలో వైద్యులు అనిల్, సిబ్బంది యోగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img