Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నాటుసారా, గంజాయి రవాణా అరికట్టేందుకుప్రత్యేకచెక్ పోస్టులుఏర్పాటు

డిఐజి హరికృష్ణ

విశాలాంధ్ర, పార్వతీపురం/పట్టణం: విశాఖపట్టణం రేంజ్ పరిదిలో నాటుసారా, గంజాయి ఉండే ప్రాంతాల్లో రవాణా అరికట్టేందుకు ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటుచేయడం జరిగిందని, నిర్మూలన చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని
విశాఖపట్టణం డిఐజి ఆఫ్ పోలీస్ ఎస్.హరికృష్ణ తెలిపారు.గురువారం ఆయన పార్వతీపురం మన్యంజిల్లా కేంద్రంలోని పార్వతీపురంపట్టణం, గ్రామీణ పోలీస్ స్టేషన్లను వార్షిక తనిఖీ నిమిత్తం విచ్చేశారు. ఆయనకు జిల్లాఎస్పీ వి.
విద్యాసాగర్ నాయుడు, అదనపు ఎస్పీ దిలీప్ కిరణ్, జిల్లాల్లోని పోలీస్ అధికారులు పుష్పగుచ్చెంలు అందజేసి ఘనస్వాగతం పలికారు. రెండు పోలీస్ స్టేషన్లలోను గౌరవ వందనం సమర్పించారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో నాటు సారా అరికట్టేందుకు జిల్లాఎస్పీ ఏర్పాటు చేసిన రెండు చెక్ పోస్టుల వద్ద ఏపీఎస్పి, సాదారణ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం పోలీసు కొరతఉన్నప్పటికీ పెద్దగా ఇబ్బందులు లేవన్నారు. ఇటీవల ప్రభుత్వం విడుదలచేసిన నోటిఫికేషన్ ద్వారా 2023లో ఆరువేలమందిని భర్తీ చేయనుండగా దానితో సిబ్బందికొరత తీరుతుందనితెలిపారు.
మావోయిస్టుల కదలికలు గతంతో పోలిస్తే ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయని, తమ పోలీస్ శాఖ మాత్రం అప్రమత్తతతో ప్రత్యేక నిఘా ఏర్పాటుచేయడం జరిగిందన్నారు, అలాగే ఏజెన్సీ ప్రాంతంలో శిల్లింగి వంటి మూఢనమ్మకాలు ప్రస్తుతంతగ్గాయని, వాటిపై అవగాహన కల్పించేందుకు కళాజాతాలను పోలీస్ శాఖ ద్వారా నిర్వహిస్తామని తెలిపారు. కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యంజిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ సంతృప్తి కరంగా ఉందన్నారు. ఆయనతో జిల్లా ఎస్పీ వి. విద్యా సాగర్ నాయుడు, అదనపు ఎస్పీ దిలీప్ కిరణ్,పార్వతీపురం,పాలకొండ డి. ఎస్పీలు సుభాష్,కృష్ణారావు, ఎస్బి సిఐ శ్రీనివాసరావు, సిఐలు కృష్ణారావు, విజయానంద్, పట్టణ, గ్రామీణ ఎస్ ఐలు ప్రకృద్దీన్, అమ్మన్నరావు,సింహాచలం ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img