Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పంటలకు కనీస మద్దతు ధర చట్టాన్ని అమలు చేయాలి:ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్

విశాలాంధ్ర,పార్వతీపురం : ఢిల్లీలో రైతు ఉద్యమం పలితంగా ప్రదానమంత్రి ఇచ్చిన హామీ మేరకు పంటలకు కనీస మద్దతు ధర అమలు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వి వి ప్రసాద్ డిమాండ్ చేశారు.సోమవారం పార్వతీపురం మన్యంజిల్లాలో జిల్లారైతు సంఘం ఏర్పాటు చేసిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. స్థానిక ఆర్టీసి కాంప్లెక్స్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా నినాదాలు చేస్తూ కలెక్టరు కార్యాలయం వద్ద రైతులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ కు నాయకులు, పలువురురైతులు వెల్లి డిమాండ్లును తెలియజేస్తూ వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా విలేకరులతో ప్రసాద్ మాట్లాడుతూ వరిపంట కోతకు వచ్చే సమయం ఏర్పడింది కనుక దళారులప్రమేయంలేకుండా దాన్యాన్ని కొనుగోలుచేయాలని, రైస్ మిల్లర్లదోపిడీ లేకుండా చూడాలని, కేరళ రాష్ట్ర ప్రభుత్వమువలే క్వింటాకు రూ.2800/లు చెల్లింపు చేయాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం చెల్లింపు చేయాలని కోరారు.పార్వతీపురం మన్యం జిల్లాలో గత ఐదేళ్లుగా తిష్టవేసిన ఏనుగుల గుంపు వల్ల నష్టపోయిన రైతులకు ఎప్పటికపుడు నష్ట పరిహారం అందజేయాలన్నారు. వాటిని తరలించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం, వాణిజ్య పంటలను నిల్వఉంచుటకు గిడ్డంగులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లచ్చయ్యపేట ఎన్ సి ఎస్ చక్కెర కర్మాగార పరిధిలోని చెరకును దళారుల ప్రమేయం లేకుండా కోనుగోలు కేంద్రాల ద్వారా కోనుగోలు చేయాలని, టన్ను చెరకుకు మద్దతుధర 3500రూపాయలను చెల్లింపు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించే వివిధ పంటల దిగుబడిని స్వేచ్చగా అమ్ముకునే విధానాన్ని అమలు చేయాలని కోరారు. రైతుల ఆత్మహత్యలు నివారించడానికి ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వలసలు నివారించడంలో అధికారులు దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
ఈకార్యక్రమంలో ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్మధరావు, సహాయ కార్యదర్శి జీవన్, గురుబిల్లి అప్పలనాయుడు, చేబోతుల లక్ష్మీనారాయణ, ఈవి నాయుడు,
ద్వారపూడిఅప్పలనాయుడు, కిమిడి రామ్మూర్తి, తెంటు సింహాచలం ప్రజా సంఘాల నాయకులు లింగరాజు,సూరయ్య,బి.టి.నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img