Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

నేటినుంచి వివిధ సేవాకార్యక్రమాలు నిర్వహణ

బిజెపినేత సురగాల ఉమా

విశాలాంధ్ర,పార్వతీపురం: ప్రధానమంత్రి మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని నేటినుంచి అక్టోబర్ 2వరకు ఆన్ని ప్రాంతాలలో వివిధ సేవాకార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని బీజేపీ మన్యం జిల్లానేత, రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి సురగాల ఉమా మహేశ్వరరావు తెలిపారు.శుక్రవారం తన కార్యాలయంలో ప్రధానమంత్రి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని 600తపాలా గ్రీటింగ్ కార్డులను పోస్టల్ అధికారికి అందజేసారు.ఈసంధర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశమంతట వివిధ రక్తదాన శిబిరాలతో మెగా రక్తదాన కార్యక్రమము నిర్వహించి శనివారం ఒక్కరోజులోనే లక్షరక్తంయూనిట్లు సేకరించే విధముగా రక్తదాన కార్యక్రమమును భారత ప్రభుత్వము నిర్వహిస్తుందని తెలిపారు. అక్టోబర్ నెల 2వరకు మెగా రక్తదాన శిబిరాలు పెద్దఎత్తున నిర్వహించి దేశంలో రక్తం కొరత నివారణకోసం చర్యలు తీసుకోవడం బీజేపీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. యువత, విధ్యార్ధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి మరొకరి ప్రాణాన్ని నిలబెట్టాలని కోరారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకోవడాన్ని వివరించారు. కేంద్ర ప్రభుత్వం, బ్లడ్ బ్యాంకు సంయుక్తంగా నిర్వహించే రక్తదానశిబిరాల్లో
జిల్లాలోని యువత, స్వచ్చంధ సంస్థలు, ప్రభుత్వ సిబ్బంది, సచివాలయాల సిబ్బంది మరియు ఇతర సామాజిక సంస్థలు అందరూ ముందుకు వచ్చి
ఈకార్యక్రమమును విజయవంతము చేయాలని కోరారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img