Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ధాన్యం కొనుగోలుపై అవగాహన కలిగి ఉండాలి

జిల్లా కలెక్టరు నిషాంత్ కుమార్

విశాలాంధ్ర, పార్వతీపురంరూరల్: ధాన్యం కొనుగోలుఅంశాలపై రైతులు అవగాహన కలిగిఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. పార్వతీపురం మండలం పెదబొండపల్లిగ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు, పౌర సరఫరాల సంస్థ అందించిన పరికరాలు, గోనె సంచులు తదితర వివరాలను జిల్లా కలెక్టర్ శుక్ర వారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వరి క్షేత్రంలో స్వయంగా పరిశీలించారు. ధాన్యం కొనుగోలు సమయంలో ధాన్యం తేమ శాతం ముందుగా పరిశీలించాలని రైతులకు సూచించారు. గోనె సంచులు అందుబాటులో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను గురించి స్పష్టమైన అవగాహన ఉండాలని, మద్దతు ధర కంటే తక్కువకు విక్రయించ వలసిన అవసరం లేదని ఆయన చెప్పారు. సాధారణ రకం క్వింటాలు (100 కిలోలు) రూ.2,040/-, 75 కిలోలు రూ. 1,530/-, గ్రేడ్ ‘ఏ’ రకం (100 కిలోలు) రూ.2,060/-, 75 కిలోలు రూ.1,545/- రైతులు నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యమును విక్రయించాలని ఆయన పేర్కొన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో రైతులకు అవసరమగు గోనె సంచులు, హమాలీలు, రవాణా సదుపాయాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాయని ఆయన చెప్పారు. ఈకార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, మండలవ్యవసాయఅధికారి రేఖ, రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img