Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఎవరి స్థలాల్లో వారే ఇళ్లనిర్మాణం చేయాలి

బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడే వారిపైచర్యలు:జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్

విశాలాంధ్ర, పార్వతీపురం/పార్వతీపురం టౌన్ : జిల్లాలో గృహనిర్మాణ కాలనీల నిర్మాణాలలో బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడేవారిపై చర్యలుతీసుకుంటామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. ఒకరికి మంజూరు చేసినస్థలంలో ఇతరులు అక్రమంగా నిర్మాణాలు చేపడితే అటువంటి విషయాలను, బెదిరింపులు, దౌర్జన్యాలను జిల్లాకలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఒకరికి కేటాయించిన ఇంటి స్థలంలో మరొకరు ఇల్లు నిర్మించుకోవడం వంటి సంఘటనలపై వస్తున్న పలు కథనాలపై జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ జిల్లాలో గృహ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, నిబంధనలకు అనుగుణంగా పట్టాలను జారీ చేయడం జరిగిందన్నారు. సంబంధిత లబ్ధిదారులు వారికి మంజూరు చేసిన స్థలాల్లో నిర్మాణాలు చేపట్టాలని ఆయన కోరారు. ఒకరి స్థలంలో ఇంకొకరు ఇల్లు నిర్మాణం చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img