Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

వరి సేకరణ కేంద్రం తనిఖీ చేసిన పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి

విశాలాంధ్ర,పార్వతీపురం: రెవెన్యూ డివిజనల్ అధికారి కె. హేమలత శుక్రవారం సాయంత్రం బలిజిపేట మండలంలోని పలగర(బి కేటగిరీ పిపిసి) వరిసేకరణ కేంద్రాన్ని తనిఖీచేశారు. అధికారులకు అదేశాలిస్తూ గన్నీ బ్యాగ్‌ల కోసం ఇండెంట్ పెంచాలని,అందుకున్న బ్యాగుల నాణ్యతను తనిఖీ చేయాలన్నారు. స్థానిక వాహనాల రిజిస్ట్రేషన్లను ప్రోత్సహించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు.వరిలో తేమ 14శాతం ఉన్నట్లుగుర్తించారు. గోనెసంచుల మొత్తం ఇరవైవేలు అవసరం కాగా నాలుగువేల గోనె సంచులు అందాయని ఇంకా పదహారు వేల గోనె సంచులు అవసరం అని అధికారులు తెలియజేసారు. రైతులు తాము స్వంతంగా కొనుగోలు చేసిన గోనె సంచులను ప్యాకింగ్‌కు ఉపయోగిస్తున్నారని, ఇంకా అయిదు వేల బస్తాలకు గోనె సంచులు కావాలని తెలిపారు. సర్వర్ సమస్యల కారణంగా ట్రక్ షీట్లు జనరేట్ కావటం లేదని, 15 ట్రాక్టర్లు, 2 లారీ లోడ్లు మిల్లులకు పంపేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. స్థానికంగా ఉన్న 20 మిల్లుల్లో 6 మిల్లులు మాత్రమే బ్యాంకు గ్యారంటీ ఇచ్చాయని, బలిజిపేట మిల్లులకు సీతానగరం, పార్వతీపురం మండలాల నుంచి వరిధాన్యాన్ని పంపినట్లు అధికారులు తెలిపారు.రైతు భరోసా కేంద్రం పరిధిలో మొత్తం 600 ఎకరాల్లో వరి సాగు చేయగా, అందులో దాదాపు 80 ఎకరాల్లో పండించిన వరిని రైతుల సొంత వినియోగానికి వినియోగించి, మిగిలిన వరిని మిల్లులకు పంపిస్తారని, బలిజిపేట మరియు గరుగుబిల్లి మిల్లులు ఈ పిపిసికి సమీపంలో ఉన్నాయని, బలిజిపేట, పలగర గ్రామాలను ఈపీపీసీకి మ్యాప్ చేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img