Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విధ్యార్ధులు సన్మార్గంలో నడవాలి

బొబ్బిలి సీనియర్ సివిల్ జడ్జి వాసుదేవన్
విశాలాంధ్ర,సీతానగరం: విధ్యార్ధులు సన్మార్గంలో నడిచి సత్ప్రవర్తన కలిగి ఉత్తమ పౌరులుగా తయారు కావాలని బొబ్బిలికోర్టు సీనియర్ సివిల్ జడ్జి, బొబ్బిలి మండల లీగల్ కమిటీ చైర్మన్ టి. వాసుదేవన్ పిలుపు నిచ్చారు.బుదవారం సాయంత్రం మండలంలోని జోగమ్మపేట బి ఆర్ అంబేద్కర్ గురుకులంలో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు.ముందుగా అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.చట్టాలపై అవగాహన కల్పించారు. విధ్యార్ధులు కూడా చట్టాలపై అవగాహన కలిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు.న్యాయ సేవలు, విద్యాహక్కుచట్టం తదితర అంశాలను వివరించారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.సరోజనమ్మ, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె. సౌమ్య జోసఫిన్, పలువురు న్యాయవాదులు ప్రసన్న కుమార్, వెంకటరమణ, ఎంఈఓ సూరిదేముడు, ప్రిన్సిపాల్ కె.ఈశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ డి రాజారావు,అధ్యాపకుల, ఉపాధ్యాయ సిబ్బంది, పాటశాలసిబ్బంది, పోలీస్ సిబ్బంది, విధ్యార్ధులు పాల్గొన్నారు. మొదటిసారి విచ్చేసిన జడ్జీలకు,న్యాయవాదులకు విధ్యార్ధులు ఘణ స్వాగతం పలికారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img