Friday, April 26, 2024
Friday, April 26, 2024

కన్వర్జెన్స్ సమావేశం నిర్వహణ

విశాలాంధ్ర,సీతానగరం: స్తానిక మండల పరిషత్ కార్యాలయంలో కృష్ణ మహేశ్ రెడ్డి ఆధ్వర్యంలో మండల అధికారులతో కన్వర్జెన్స్ సమావేశం మంగళవారం నిర్వహించారు. మండలంలో వివిధ శాఖల ద్వారా నిర్వహిస్తున్న, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గూర్చి సమీక్ష చేశారు. గ్రామపంచాయతీల వారీగా చేస్తున్న అభివృధ్ధికార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఎంపిడిఓ కోరారు. ఈనెల 23న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఉన్నందున అన్నిశాఖలఅధికారులు నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ఈసమావేశంలో
ఈఓపిఅర్డే వర్మ, పరిపాలన అధికారి ప్రసాద్,వైద్యులు శిరీష,ఉపాధి హామీ పథకం ఏపిఓ నాగలక్ష్మి, వెలుగు
ఏపిఎం శ్రీరాములు, గృహ నిర్మాణశాఖ ఏఈ జానకీరాం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img