Friday, April 19, 2024
Friday, April 19, 2024

రూ.3.87కోట్ల చెరకుబకాయిల చెక్కులు బ్యాంకులో జమ

ఎన్ సి ఎస్ బకాయిలు చెల్లింపుపట్ల హర్షం వ్యక్తంచేసిన రైతుసంఘాలు, రైతులు

విశాలాంధ్ర – పార్వతీపురం: మన్యం జిల్లాలోని సీతానగరం మండలంలోని లచ్చయ్యపేట ఎన్ సి ఎస్ చక్కెర కర్మాగార యాజమాన్యం చెరకు రైతులకు చెల్లింపు చెల్లింపు చేయాల్సిన మిగులు చెరకుబకాయిలు 3కోట్ల 87లక్షల 60వేల 894రూపాయలకు జిల్లాకలెక్టర్ నిషాంత్ కుమార్ మంగళవారం అమోదం తెలియజేస్తూఉత్తర్వులు జారీచేశారు. దీంతో వెంటనే పెదబోగిల స్టేట్ బ్యాంకులో 1111మంది రైతుల బకాయిల మొత్తం డబ్బులకు సంబందించి చెక్కులను సీతానగరం తహశీల్దార్ రమణ, షుగర్
కేన్ డిప్యూటీ కమిషనర్లు సంతకాలు చేసి జమచేశారు.
2019-20,2020-21గానుగ సీజన్లో చెరకు రైతులకు యాజమాన్యం 16కోట్ల 84లక్షల 88వేల385రూపాయలు బకాయిలు ఉండగా గతఏడాది నవంబర్ 3న ఎన్ సి ఎస్ కర్మాగారంఎదుట రైతుసంఘాలు, రైతులు పెద్దఎత్తున పాల్గొని ధర్నా నిర్వహించిన సమయంలో ఆందోళన ఒక్క సారి ఉద్రిక్తంగామారి ఒకమహిళా పోలీసుకు, ఎస్ఐకు దెబ్బలు తగిలి అరెస్టులు జరిగాయి.దీంతో ఆర్ ఆర్ యాక్టు అమలుచేయాలని అధికారులు నిర్ణయించారు. ఉమ్మడిజిల్లాలో ఉంటున్న సమయంలోనే ఈఏడాది ఫిబ్రవరి 9న జ
వేలంపాటజరిగగా బొబ్బిలికి చెందిన ధాత్రిరియల్ ఎస్టేట్ అండ్ డవలపర్స్ సంస్థ 20కోట్ల ఐదులక్షల రూపాయలకు ఎన్ సి ఎస్ భూములను పాడుకున్నారు.పార్వతీపురం మన్యంజిల్లా ఏర్పడినతరువాత జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆనంద్,సబ్ కలెక్టర్ భావన, జిల్లా రెవెన్యూఅధికారి వెంకటరావులు ప్రత్యేకశ్రద్ద తీసుకొని మొదటి విడతగా
మేనెలలో 9కోట్ల 20లక్షల రూపాయలు చెల్లింపు చేశారు. రెండోవిడతగా జూన్ నెలలో 3కోట్ల 87లక్షల 60లక్షల 894రూపాయలను చెల్లింపుచేయగా మిగిలినబకాయిల మొత్తం మూడోవిడతగా 3కోట్ల 87లక్షల 60వేల 894రూపాయలను మంగళవారం బ్యాంకులో జమచేశారు. రైతుసంఘాలు, రైతులుచేసిన పోరాటాలు,నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు,విన్నపాలు,విజ్ఞప్తులు పలితంగా చెరకురైతులకు రావాల్సిన బకాయిలు పూర్తిగా అందటంపట్ల చెరకు రైతుసంఘంనేతలు రెడ్డి లక్షుమునాయుడు,మూడడ్ల కృష్ణమూర్తి, రెడ్డివేణు,రెడ్డిఈశ్వరరావు,అప్పారావులతో
పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి కె.మన్మధ రావు, సహాయ కార్యదర్శి జీవన్, కార్యవర్గ సభ్యులు బుడితి అప్పలనాయుడులు హర్షం వ్యక్తంచేశారు. జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ కు, జాయింట్ కలెక్టర్ ఆనంద్ కు,జిల్లాఅధికారులకు, వేలంపాటపాడి సకాలంలో రైతులకు డబ్బులుచెల్లించిన ధాత్రి రియల్ ఎస్టేట్ అండ్ డవలపర్స్ సంస్థ వారికి కృతఙ్ఞతలుచెప్పారు. మంచి సమయంలోచిన్న,సన్నకారు రైతులకు బకాయిలు చెల్లించడం ఎంతో ఆనందంగా ఉందని పలువురు రైతులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img