Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

జగనన్న ఇళ్ళను త్వరితగతిన నిర్మాణాలు చేయండి

గృహనిర్మానశాఖ పి డి

విశాలాంధ్ర, సీతానగరం: మండలంలో జగనన్న కాలనీలో ఇళ్ళను త్వరితగతిన నిర్మాణాలు చేయండని గృహ నిర్మాణ శాఖ పధక సంచాలకులు రఘురాం పిలుపు నిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో పెదబోగిలి గ్రామ పంచాయతీలో జగనన్న లే అవుట్ పరిశీలించి లబ్దిదారులతో మాట్లాడారు. ఇళ్ళ స్థలాలలో నిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేయాలని కోరారు.మండలములో 2515ఇళ్లకు ఇంకా 750ఇల్లను ప్రారంభం చేయలేదని, వారంతా సత్వరమే పనులు ప్రారంభం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ జూనియర్ ఇంజనీర్ జానకీరామ్,సర్పంచ్ తేరేజమ్మ, ఎంపిటిసిలు కిరణ్, సూర్యనారాయణ, ఉప సర్పంచ్ అరవింద్, సచివాలయం ఇంజనీర్ సంతోష్, గృహ నిర్మాణ శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ కృష్ణ,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img