Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కుష్టు వ్యాధిపై ఇంటింటి సర్వే

విశాలాంధ్ర – సీతానగరం:కుష్టు వ్యాధి నివారణపై నేటి నుంచి డిసెంబరు 5వరకు ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతుందని సీతానగరం, పెదంకలం పి హెచ్ సి వైద్యాధికారులు శిరీష, రాదా కాంత్, ఉషారాణిలు తెలిపారు.మంగళ వారం జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం సర్వే నిర్వహణపై రెండు పి హెచ్ సి లలో ర్యాలీలు, అవగాహణ కార్యక్రమాలు నిర్వహించారు. సర్వేలో ఆశా వర్కర్లు, ఏ.ఎన్.ఎం, పురుష వాలంటీర్లు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించాలని తెలిపారు. చర్మంపై స్పర్శలేని మచ్చలు ఉన్నవారు, కనుబొమ్మలు, రెప్పల వెంట్రుకలు రాలిపోవడం, కనుబొమ్మలు మూతపడటం లాంటివి ఎవరికైనా ఉంటే వారు స్వచ్చందంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి, ఆరోగ్య కేంద్రంకి వచ్చి వివరాలను అందించాలని అన్నారు. కుష్టు వ్యాధి సులభంగా అంటుకునే అంటు వ్యాధి కాదని, ఇది చర్మానికి, నాడీ వ్యవస్థకు సంబంధించి దీర్ఘకాలిక వ్యాధి అని వివరించారు. క్షయవ్యాధికి కారకమైన మైక్రో బాక్టీరియావల్ల కుష్టు వ్యాధి వస్తుందని చెప్పారు. జాతీయ కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా కుష్టు వ్యాధి చర్మం అసలు రంగు కంటే ముదురు లేదా లేతరంగులో ఉండే మచ్చలద్వారా ఈవ్యాధిని గుర్తిస్తారన్నారు.ఈవ్యాధిని నిర్ధారించడానికి చర్మ లేదా నరాల బయాప్సీ చేసి వ్యాధిని నిర్దారించవచ్చని ఆయన పేర్కొన్నారు. వ్యాధిని అదుపుచేయుటకు యం.డి.టి మందులను ఆరోగ్య కార్యకర్తలు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. ఈకార్యక్రమంలో వైద్యసిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img