Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

తెలుగు భాషను పాలనాభాషగా ఉపయోగించాలి

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

విశాలాంధ్ర,పార్వతీపురం : తెలుగు భాషను పాలనాభాషగా ఉపయోగించాలని రాష్ట్రఅధికార భాషా సంఘంఅధ్యక్షులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. మన్యం జిల్లాలోని పోలీస్ కార్యాలయంలో తెలుగు భాషపై ఆయన సమీక్ష చేశారు.అందరూ తెలుగు భాషతో మమేకం కావాలని,తెలుగు భాషను పాలనాభాషగా ఉపయోగించని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.అధికార భాషా సంఘం  అధ్యక్షులు లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి తెలుగు అకాడమీని, అధికార భాషా సంఘంను పునరుద్ధరించారని చెప్పారు. పాలనా భాషగా తెలుగును అమలు చేయుటకు ఆదేశించే అధికారం తెలుగు భాషా సంఘానికి లేదని అయితే ముఖ్యమంత్రి ప్రత్యేకశ్రద్దతీసుకొని సాహసోపతంగా ప్రభుత్వ ఉత్తర్వలు విడుదలచేశారని చెప్పారు. ఈఉత్తర్వులు అమలుచేయని అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రాచీన భాషా హోదాను వై యస్. రాజశేఖర రెడ్డి సంపాదించారని ఆయనతెలిపారు. ప్రాచీన భాషా అధ్యయన కేంద్రంను రాష్ట్రానికి ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకు వచ్చారని ఆయన అన్నారు. ఆత్మన్యూనతనువదిలి మనభాషకు ప్రాదాన్యత ఇవ్వాలని ఆయన ఉద్బోధించారు. గొప్ప వారసత్వ సంపద కలిగిన మృదు మధుర భాష అని ఆయన చెప్పారు. పాలనా భాషగా చేయుటకు అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు. ఆంధ్ర ప్రదేశ్ తెలుగు అధికార భాషా సంఘం కార్యాలయం విశాఖపట్నంలో నెలకొల్పడం జరిగిందని ఆయన చెప్పారు. పోలీసు సూపరింటెండెంట్ వి. విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే సాధ్యమైనంత వరకూ చేస్తున్నామని తెలిపారు. తెలుగు భాష అమలుకు, అభ్యున్నతికి మరింత కృషి చేస్తామని ఆయన తెలిపారు.
ఈసమావేశంలో అదనపు పోలీసు సూపరింటెండెంట్ డా. ఓ.దిలీప్ కిరణ్, డీఎస్పీలు ఏ.సుభాష్, శ్రావణి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావు, అధికార భాషా సంఘం  కార్యదర్శి రామ్ గోపాల్, ప్రాజెక్టు అధికారి డా. సి.సత్యలత, డా.వి. సరోజిని, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img