Monday, April 22, 2024
Monday, April 22, 2024

అభివృద్ధికి అన్నివర్గాల సహకారం అవసరం

: ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్‌ పట్టణంలో సుమారు రూ.55 కోట్లతో వివిధ అభివృద్ధి, సుందరీకరణ పనులను చేపట్టినట్లు ఎమ్మెల్యే జోగు రామన్న చెప్పారు. పట్టణంలో చేపడుతున్న అభివృద్ధికి అన్నివర్గాల సహకారం అవసరమని కోరారు. జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన డివైడర్ల మధ్య మిడిల్‌ ప్లాంటేషన్‌ను కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌తో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న బుధవారం ప్రారంభించారు. తీర్పేల్లి వద్ద రోడ్డు వెడల్పు పనులతో పాటు చాందా పాత వంతెన వద్ద పరిసరాలను పరిశీలించారు. కలెక్టర్‌తో కలిసి చౌరస్తాలో డివైడర్ల మధ్య మీడియన్‌ ప్లాంటేషన్‌లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ, పట్టణ పరిశుభ్రతలో మమేకమై అంటువ్యాధులకు ఆస్కారం ఇవ్వకుండా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పట్టించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ, ఆర్‌ అండ్‌ బీ అధికారి సురేశ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జాహిర్‌ రంజాని, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img