రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీ
పీసీఆర్ పరీక్షలు చేయాలని ఆదేశించింది. ఆర్టీ`పీసీఆర్, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని తెలిపింది. భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా పాటించాలని హైకోర్టు స్పష్టంచేసింది. కరోనా వ్యాప్తి నియంత్రణపై ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు విచారణ సందర్భంగా ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.