Saturday, February 4, 2023
Saturday, February 4, 2023

ఏపీలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా?: హరీశ్‌ రావు

హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌ చేసి.. తెలంగాణ ప్రాంత నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టిన చంద్రబాబును.. తెలంగాణ ప్రజలు ఎవరూ పట్టించుకోరని.. తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికే చంద్రబాబు ఈ డ్రామాలు ఆడుతున్నారని ఫైర్‌ అయ్యారు. 2018లో పెద్ద కూటమి కట్టి వచ్చిన చంద్రబాబు.. ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. చంద్రబాబుది భస్మాసుర హస్తం అని.. అందుకే ఆ కూటమి చిత్తుగా ఓడిపోయిందని చెప్పారు. బార్డర్‌ జిల్లాలో సభ పెట్టి.. తాను చెప్పనిదే కోడి కూయదని చెప్పే రకం చంద్రబాబు అని పంచ్‌లు పేల్చారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చంద్రబాబును చిత్తుగా ఓడిరచారని.. ఏపీలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా? అని హరీశ్‌ రావు ప్రశ్నించారు. ఆయన ఏ ఎండకి.. ఆ గొడుగు పట్టే రకమని ఆరోపించారు. రైతులు, ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు ఖమ్మంలో షో నిర్వహించారని ఎద్దేవా చేశారు. బాబు పాలనలోనే తెలంగాణ నిలువునా దోపిడీకి గురయిందన్నారు. తన వల్లనే వ్యాక్సిన్‌ వచ్చిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీతో పొత్తు కోసమే చంద్రబాబు వెంపర్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఇప్పుడున్న టీడీపీ ఎన్టీఆర్‌ టీడీపీ కాదని.. ఇదంతా వేరే రకం అని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img