Friday, December 2, 2022
Friday, December 2, 2022

ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు ముఖ్యం : మంత్రి హరీశ్‌ రావు

ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు ముఖ్యమని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సిద్దిపేట కమిషనరేట్‌లో పోలీస్‌ అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో పోలీస్‌ అమరవీరులకు మంత్రి హరీశ్‌ రావు, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, పోలీస్‌ కమిషనర్‌ శ్వేత పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో, శాంతి భద్రతల పరిరక్షణకు ఎంతో మంది పోలీసులు ప్రాణ త్యాగాలు చేశారు. ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా, దేశమైనా అభివృద్ధి సాధించాలంటే శాంతి భద్రతలు ముఖ్యమన్నారు. ఎక్కడైతే ప్రజలు నిర్భయంగా జీవించగలుగుతారో అక్కడికి పెట్టుబడులు వస్తాయి.. అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సిద్దిపేట ప్రాంత అభివృద్ధిలో పోలీసుల పాత్ర ఎంతో ప్రశంసనీయమన్నారు. పోలీసుల సంక్షేమం కోసం 20 కోట్లతో పోలీస్‌ కన్వెన్షన్‌ హాల్‌ నిర్మించామని.. దీని మీద వచ్చే ఆదాయం పోలీసుల సంక్షేమానికే వినియోగమన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img