Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఒక్కసారిగా పడిపోయిన పగటి ఉష్ణోగ్రతలు.. హైదరాబాద్‌లో మరింత పెరిగిన చలితీవ్రత

హైదరాబాద్‌ నగరంను మరోసారి చలి వణికిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన చలి తీవ్రత.. మళ్లీ వణుకు పుట్టిస్తోంది. ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరికొన్ని రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు వెల్లడిరచారు. తీవ్రమైన చలి ఉండటంతో హైదరాబాద్‌ నగర వాసులు ఉదయం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడుతుందనుకుంటున్న వాయుగుండం.. తుపాను కారణంగా ఈదురు గాలులతో చలి తీవ్రత మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఇక డిసెంబర్‌ 15వ తేదీన అండమాన్‌ సముద్రం లేదా దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం 20వ వరకు ఉండే అవకాశం ఉంది. దీని కారణంగా చలి తీవ్రత కూడా మరింత పెరగనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img