Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కేంద్ర తీసుకున్న నిర్ణయాలతోనే దేశంలో విద్యుత్‌ కోతలు

మంత్రి జగదీశ్‌ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతోనే ఇవాళ దేశంలో విద్యుత్‌ కోతలు సంభవించాయని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో రెండు వందల ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని..విద్యుత్‌ కోతలకు ఆస్కారమే లేదని..ఒక్క నిమిషం కూడా రాష్ట్రంలో పవర్‌ కట్‌ ఉండదని తేల్చిచెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను హైదరాబాద్‌కు సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మళ్ళీ హైదరాబాద్‌ నుండి ఇతర జిల్లాలకు సరఫరా చేసేలా విద్యుత్‌ వలయం ఏర్పాటు చేశామని తెలిపారు. హైడల్‌ పవర్‌ ఉత్పత్తి కూడా బాగుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రాబోయే రోజుల్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చట్టాల వలన రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు వస్తాయి కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో ఎక్కడ కూడా కోతలు లేవన్నారు. విద్యుత్‌ సంస్థలను ప్రైవేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకే ఈ బొగ్గు కృత్రిమ కొరత అని నిపుణులు అంటుంటే నిజమే అనిపిస్తుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img