Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

కేసీఆర్‌ భయపడుతున్నారు…


: రేవంత్‌ రెడ్డి
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించాలంటే కేసీఆర్‌ భయపడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శించారు.ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ వేర్వేరుకాదని, ఒకే తానులోని ముక్కలని, నాణేనికి బొమ్మా, బొరుసు లాంటివాళ్లని అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగే భారత్‌ బంద్‌కు మద్దతు ఇవ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీలో ప్రధాని మోదీ విందులో పాల్గొన్నారని అన్నారు. ఉప్పల్‌లో జరుగుతున్న ధర్నాలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. నిత్యావసర ధరలు, పెట్రోల్‌, డీజీల్‌ పెంపుకు వ్యతిరేకంగా, నిరుద్యోగ సమస్యపై, ప్రధాని ఇచ్చిన హామీలు వైఫల్యం, నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ భారత్‌ బంద్‌ జరుగుతోందన్నారు. కేవలం సమస్యల పరిష్కారం కోసం సీఎం ఢల్లీి పర్యటన చేస్తే.. పోయిన వారమే ప్రధాని, అమిత్‌ షా, మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిశారన్నారు. ఇవాళ బందులో పాల్గొనకుండా.. ఢల్లీిలో మోదీతో విందులో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారంటే.. ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img