Monday, October 3, 2022
Monday, October 3, 2022

జంట జలాశయాలకు పోటెత్తిన వరద..గేట్లు ఎత్తివేత

హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి 7 నుంచి 9 గంటలవరకు వాన దంచికొట్టింది. భారీవర్షానికి జంట జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు రెండు చెరువుల నుంచి మూసీ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు.హిమాయత్‌ సాగర్‌ నాలుగు గేట్లు ఎత్తి 1,400 క్యూసెక్కులు, ఉస్మాన్‌సాగర్‌ 4 గేట్లు ఎత్తి 960 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నిన్న రాత్రి కురిసిన వానకు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల రహదారులు చెరువులను తలపిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. ఈ ఉదయానికి చాలా ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img