Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

తెలంగాణలో భారీ వర్షాలు…

రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రానికి మరో మారు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఈనెల ఏడవ తేదీ నుండి 9వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో నిత్యం వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్‌ నగరంలో రహదారులపై మీరు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయం కాగా, అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదనీటిలో చిక్కుకున్న కాలనీలలో పరిస్థితులు దారుణంగా మారాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img