Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

తెలంగాణ పై దాడికి బీజేపీ కుట్ర

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు
తెలంగాణ పై దాడికి బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ప్రధాని నిన్న రాజ్యసభలో తెలంగాణ విభజనపై విషం కక్కారని చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు నేతృత్వంలో పాలకుర్తి నియోజకవర్గంలో నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నియోజకవర్గంలోని రాయపర్తి, తొర్రూరు, పాలకుర్తి, దేవరుప్పుల మండల కేంద్రాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్వయంగా బైక్‌ ర్యాలీలలో పాల్గొన్నారు.తెలంగాణను కానీ, కేసీఆర్‌ను కానీ ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ బిడ్డలు చాలా చైతన్యవంతులన్న విషయం గుర్తు చేశారు.రాజ్యాంగ బద్ధంగా విభజన జరిగిందని, తెలంగాణ విభజనను వ్యతిరేకించినా, కించపరిచినా రాజ్యాంగాన్ని వ్యతిరేకించి, కించపరచడమేనని మంత్రి అన్నారు. కార్యక్రమాల్లో ఆయా మండలాల పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img