Thursday, May 30, 2024
Thursday, May 30, 2024

దమ్ముంటే..డిపాజిట్‌ తెచ్చుకోవాలి

రేవంత్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ సవాల్‌
హుజూరాబాద్‌ ఉపఎన్నికలో దమ్ముంటే కాంగ్రెస్‌ పార్టీ డిపాజిట్‌ తెచ్చుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. మంగళవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిలో మాట్లాడుతూ, హుజురాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు. ఈటల రాజేందర్‌ కోసమే కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందన్నారు. త్వరలో ఈటలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తారన్నారు. ంవంత్‌ రెడ్డి చిలక జోస్యం చెప్పుకుంటే బెటర్‌ అని కేటీఆర్‌ అన్నారు. హుజూరాబాద్‌లో కావాలనే కాంగ్రెస్‌ పార్టీ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపలేదు. పీసీసీ అధ్యక్షుడు అయ్యాక.. ఇది తొలి ఉప ఎన్నిక. తనను తాను నిరూపించుకోవాలి కదా..? ఎందుకు హుజూరాబాద్‌కు వెళ్లడం లేదని రేవంత్‌ను ఉద్దేశించి కేటీఆర్‌ ప్రశ్నించారు. తాను హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లడం లేదు. నాగార్జున సాగర్‌, దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి కూడా వెళ్లలేదు అని అన్నారు. హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ ప్రచారం షెడ్యూల్‌ ఖరారు కాలేదన్నారు.నవంబర్‌ 15 తర్వాత తమిళనాడుకు వెళ్తామని కేటీఆర్‌ తెలిపారు. డీఎంకే, అన్నాడీఎంకే నిర్మాణాన్ని అధ్యయనం చేస్తామన్నారు. నీట్‌ రద్దుపై స్టాలిన్‌తో 100 శాతం ఏకీభవించలేం. తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. రాష్ట్ర విద్యార్థులకు ఏది మేలైతే.. ఆ నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img