Friday, June 14, 2024
Friday, June 14, 2024

సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ప్రజలకు మెరుగైన సేవలు

: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్‌లో రూ. 38 కోట్లతో నిర్మించనున్న జిల్లా పోలీసు శాఖ కార్యాలయానికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పోలీసు శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుందని చెప్పారు. జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం, సాయుధ దళ కార్యాలయం, పోలీసు ప్రధాన కార్యాలయం సాంకేతిక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలను కాపాడుతూ పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర పోలీసు శాఖకు దేశంలో మంచి పేరు ఉందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img