Monday, April 22, 2024
Monday, April 22, 2024

ప్రతి దళిత బిడ్డ రైతు కావాలి : సీఎం కేసీఆర్‌

వాసాలమర్రి గ్రామంలోని 76 ఎస్సీ కుటుంబాలకు దళిత బంధు పథకం మంజూరయింది. ఇవాళ వాసాలమర్రి గ్రామంలో పర్యటించి గ్రామ ప్రజలతో సీఎం కేసీఆర్‌ ముఖాముఖి నిర్వహించారు. గ్రామంలోని అందరికీ ఒకే విడతలో దళిత బంధు నిధులు పంపిణీ చేస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. లభ్ధిదారుల ఖాతాల్లో రేపు పది లక్షల రూపాయల చొప్పున నగదు ట్రాన్స్‌ఫర్‌ చేస్తాం, ఎలా ఖర్చు చేసుకుంటారో వారి ఇష్టమని సీఎం అన్నారు. నిధులు దుర్వినియోగం కాకుండా ఉపాధి పెరిగే మార్గాలను ఎంచుకోవాలని సీఎం సూచించారు. ‘వాసాలమర్రిలో వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ మిగులు భూమి ఉంది. ప్రభుత్వ మిగులు భూములను దళిత కుటుంబాలకు పంపిణీ చేస్తాం. దళితుల భూమిని మరెవ్వరూ తీసుకునే అర్హత లేదు. ప్రతి దళిత బిడ్డ రైతు కావాలి. వాసాలమర్రిలో కొత్త చరిత్ర సృష్టించాలి.’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img