Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ప్రధాని మోదీకి రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ..

ప్రధాని నరేంద్ర మోదీకి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. విభజన చట్టం, తెలంగాణకు ఇచ్చిన హామీలపై లేఖలో ప్రస్తావించారు. హామీల అమలుకు చొరవ చూపకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్షం చేసిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్‌ దృష్టి పెట్టలేదన్నారు. ప్రధానిగా హామీలను నెరవేర్చడం మీ బాధ్యత అన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని తేల్చడంతో తెలంగాణ యువతకు నిరాశ మిగిలిందన్నారు. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు హామీని అటకెక్కించారన్నారు. ప్రత్యేక గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు చొరవ చూపలేదన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించాలనుకోవడం నిప్పుతో చెలగాటమేనన్నారు. హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసును కేంద్ర సంస్థలకు అప్పగించాలని లేఖలో కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img