test
Monday, May 27, 2024
Monday, May 27, 2024

ప్రముఖ ఫోటోగ్రాఫర్‌ గుడిమల్ల భరత్‌ భూషణ్‌ మృతికి సీఎం కేసీఆర్‌ సంతాపం


ప్రముఖ ఫోటోగ్రాఫర్‌ గుడిమల్ల భరత్‌ భూషణ్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల జీవన శైలిని, చారిత్రక ఘట్టాలను, సంస్కృతిని తన ఛాయా చిత్రాలు, ఆర్ట్‌ ద్వారా ప్రపంచానికి తెలియజేశారని కొనియాడారు. దశాబ్దాల పాటు ఆయన చేసిన కృషి చాలా గొప్పదని అన్నారు. భరత్‌ మరణంతో తెలంగాణ ఒక అరుదైన ఫొటో జర్నలిస్టును, చిత్రకారుడిని కోల్పోయిందని చెప్పారు. భరత్‌ భూషణ్‌ కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img