Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

ఫార్మ సంస్థపై ఐటీ దాడి..సోదాల్లో రూ.142 కోట్లు స్వాధీనం

నగరంలోని హెటిరో ఫార్మసీ సంస్థపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. సోదాల్లో సుమారు రూ.142 కోట్లు సీజ్‌ చేసినట్లు ఇవాళ ఐటీశాఖ వెల్లడిరచింది. హెటిరో సంస్థకు చెందిన 50 ప్రాంతాల్లో ఐటీశాఖ సోదాలు జరిగాయి. మొత్తం ఆరు రాష్ట్రాల్లో జరిగిన తనిఖీల్లో.. సుమారు రూ.142 కోట్ల క్యాష్‌ను సీజ్‌ చేసినట్లు పేర్కొంది. ఇక లెక్కకు రాని ఆదాయం సుమారు రూ.550 కోట్లు ఉంటుందని తెలిపింది. సోదాల సమయంలో మొత్తం 16 బ్యాంకు లాకర్లు గుర్తించినట్లు వెల్లడిరచింది. ఆ సోదాల్లో రూ.142 కోట్లకు పైగా నగదు లభ్యమైందని అధికారులు తెలిపారు. కోవిడ్‌ చికిత్సకు అవసరమైన రెమిడిసివిర్‌, ఫావిపిరావిర్‌ లాంటి ఔషధాలను హెటిరో సంస్థ ఉత్పత్తి చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img