Monday, September 26, 2022
Monday, September 26, 2022

బతుకమ్మ పాటను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

బతుకమ్మ పండుగ సందర్భంగా ‘సిరిమల్లెలో రామ రఘుమెల్లెలో’ అనే బతుకమ్మ ప్రత్యేక గీతాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌ని తన నివాసంలో ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ పాటను రూపొందించిన జెన్నారం జెడ్పీటీసీ ఎర్ర శేఖర్‌ బృందాన్ని అభినందించారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రోత్స హిస్తుందన్నారు. కార్యక్రమంలో హోమ్‌ మినిస్టర్‌ మహమూద్‌ అలీ, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌ దీపికారెడ్డి , ఉర్దూ అకాడమీ చైర్మన్‌ ముజీబ్‌, హాజ్‌ కమిటీ చైర్మన్‌ సలీం, టీఎస్‌ ఫుడ్స్‌ చైర్మన్‌ రాజీవ్‌ సాగర్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img