Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

బీజేపీ,కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఈ అభివృద్ధి ఎందుకు లేదో? : మంత్రి వేముల


అరవై ఏండ్లలో జరగని అభివృద్ధి సీఎం కేసీఆర్‌ వచ్చిన తర్వాత ఈ ఏడు సంవత్సరాల్లోనే జరిగిందని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో గల బాల్కొండ, కమ్మర్‌పల్లి మండలాల్లో సుమారు 8 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. దేశ వ్యాప్తంగా 10 ఉత్తమ గ్రామాలు ఎన్నికైతే అందులో 7 గ్రామాలు తెలంగాణ నుంచే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ మే చెప్తుందని గుర్తు చేశారు. బీజేపీ,కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఈ అభివృద్ధి ఎందుకు లేదో ఆ పార్టీ కార్యకర్తలు ఆలోచన చేయాలని సూచించారు. బాల్కొండ నియోజకవర్గంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరుగుతుందని దీనిపై చర్చకు సిద్ధమన్నారు. ఎనిమిది ఏండ్ల కింద జరిగిన తెలంగాణ ఏర్పాటు మీద పార్లమెంట్‌ లో అవమానకరంగా మాట్లాడుతున్న ప్రధాని మోదీ చేత ఇక్కడి బిజెపి నాయకులు కిషన్‌ రెడ్డి,సంజయ్‌,అర్వింద్‌ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img