Saturday, August 13, 2022
Saturday, August 13, 2022

భారీవర్షాల నేపథ్యంలో అత్యవసరమైతేనే బయటకు వెళ్లండి : మంత్రి కేటీఆర్‌

భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌.. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహుల్‌ హెగ్డేతో ఇవాళ ఉదయం ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాలో వర్షాలు, వరద పరిస్థితులను కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. మిడ్‌ మానేరు, అప్పర్‌ మానేరు, అనంతగిరి ప్రాజెక్టుతో పాటు మానేరు నది వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలువలు, చెరువులు, కుంటలు, చెక్‌ డ్యామ్స్‌ వద్ద కూడా రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.రోడ్లు, భవనాల శాఖ అధికారులు.. బ్రిడ్జిలు, కల్వర్టులను పరిశీలిస్తూ, అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్‌ సూచించారు. తెగిపడ్డ విద్యుత్‌ తీగలు, నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలను తొలగించాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, విద్యుత్‌, పోలీసు, ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని చెప్పారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని కేటీఆర్‌ కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img