Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

మరోమారు పెరగనున్న రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు

ఫిబ్రవరి 1 నుంచి అమలుకు నిర్ణయం
తెలంగాణలో రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు మరోసారి పెరగనున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మూల మార్కెట్‌ విలువల్ని సవరించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. కొత్త మార్కెట్‌ విలువలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిసింది. వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువల్ని 50 శాతం, ఖాళీ స్థలాల విలువను 35 శాతం, అపార్టుమెంట్ల విలువను 25 శాతానికి పెంచాలని నిర్ణయించింది. మరోవైపు బహిరంగ మార్కెట్‌లో విలువలు భారీగా ఉన్నచోట అవసరమైన మేరకు సవరించుకునేందుకు అవకాశం కల్పించనుంది. ఈ మేరకు నాలుగైదు రోజుల్లో ఆర్డీవోల నేతృత్వం లోని కమిటీలు కొత్త మార్కెట్‌ విలువల్ని ఖరారు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్‌ విలువలు అమల్లోకి వచ్చేలా వారం రోజుల్లో పెంపు కార్యాచరణ వేగవంతం చేయాలని రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img