Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

మావోయిస్టులు చొరబడకుండా చర్యలు : మహేందర్‌ రెడ్డి

పక్క రాష్ట్రాల నుంచి మావోయిస్టులు చొరబడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం (నూగురు) మండల కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతమైన అలుబాక బేస్‌ క్యాంపును ఆయన సందర్శించారు. అక్కడ పోలీస్‌ అధికారులతో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ తోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. నేర నివారణ లక్ష్యంగా రాష్ట్ర పోలీస్‌ శాఖ పనిచేస్తుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img