Friday, September 30, 2022
Friday, September 30, 2022

రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని హైదదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని..అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని తెలిపింది. పశ్చిమ, వాయువ్య దిశగా అల్పపీడనం ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 11న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో మంగళ, బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img