Friday, March 31, 2023
Friday, March 31, 2023

రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌, సీఎం

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.సంక్రాంతి అందరికీ సంతోషం, ఆరోగ్యాన్ని తీసుకురావాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. మకర సంక్రాంతికి సంస్కృతీ పరంగా గొప్ప ప్రాముఖ్యత ఉందని ఆమె పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సంక్రాంతి వేడుకలు దగ్గరకు చేస్తాయని చెప్పారు. కోవిడ్‌ నిబంధనలకు లోబడి పండుగ జరుపుకోవాలని గవర్నర్‌ తమిళిసై సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సంక్రాంతి పండుగ జరుపుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ప్రజలంతా సిరిసంపదలతో, భోగభాగ్యాలతో ఉండాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. స్వరాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసుకోగలిగామని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో నిత్య సంక్రాంతిని నెలకొల్పామన్నారు. రైతుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img