Saturday, August 20, 2022
Saturday, August 20, 2022

రాహుల్‌ని విమర్శించే స్థాయి, అర్హత నీకు లేవు

హరీశ్‌రావుపై రేవంత్‌రెడ్డి మండిపాటు
కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ రేపు, ఎల్లుండి తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ పై హరీశ్‌రావు సెటైర్లు వేశారు. తెలంగాణకు ఆయన ఎందుకొస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారని, రైతులు కష్టాలను అనుభవించారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ… పోలీసుల పహారా లేనిదే నువ్వు, నీ మామ తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఎందుకొచ్చిందని హరీశ్‌ను ప్రశ్నించారు. నీ పర్యటన సమయంలో పోలీసులు పొలాలకు వెళ్లి రైతులను ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాహుల్‌ని విమర్శించే స్థాయి, అర్హత నీకు లేవని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img