Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

రాహుల్‌పై విమర్శలు చేసిన కేటీఆర్‌కు రేవంత్‌ రెడ్డి కౌంటర్‌

సొంత నియోజకవర్గం అమేథిలో గెలవలేకపోయిన రాహుల్‌ గాంధీ తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయ ఆశయాలను అపహాస్యం చేస్తున్నారంటూ కేటీఆర్‌ విమర్శించడం తెలిసిందే. రాహుల్‌ గాంధీ ముందు తన సొంత నియోజకవర్గంలో ప్రజలను మెప్పించడం నేర్చుకోవాలని హితవు పలికారు. అయితే, కేటీఆర్‌ వ్యాఖ్యలకు తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు.మీరు డబ్బా కొట్టుకుంటున్న ‘జాతీయ’ నాయకుడి రాజకీయ జీవితం ఓటమితోనే మొదలైందన్న సంగతి గుర్తుందా…? అని ప్రశ్నించారు. కన్నకూతురినే ఎంపీగా గెలిపించుకోలేకపోయాడని ఎద్దేవా చేశారు. ఎవరన్నా గుర్తు చేయండ్రా బాబూ… అంటూ రేవంత్‌ రెడ్డి వ్యంగ్యం ప్రదర్శించారు. ‘డ్రామారావు’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ తో కేటీఆర్‌ ట్వీట్‌ పై ఈ మేరకు స్పందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img