Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

రేపు, ఎల్లుండి కొన్ని ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు

ఈనెల 22, 23వ తేదీల్లో కొన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.నిర్వహణ పనుల కారణంగా లింగంపల్లి-హైదరాబాద్‌, హైదరాబాద్‌-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌-లింగంపల్లి (రైల్‌ నెంబర్‌: 47150), లింగంపల్లి-సికింద్రాబాద్‌ (రైల్‌ నెంబర్‌: 47195) సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడిరచారు. (నెంబర్‌: 07762) కాలాబురాగ్‌-బీదర్‌ డెమూ, (నెంబర్‌: 07763) బీదర్‌-కాలాబురాగ్‌ డెమూ, (నెంబర్‌: 07791) కాచిగూడ-నడికుడి డెమూ, (నెంబర్‌: 07792) నడికుడి-కాచిగూడ రైళ్లను ఈనెల 23వ తేదీన రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img