Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

రైతు బంధు కావాలా.. రాబందు కావాలా.. : మంత్రి కేటీఆర్‌

పేదవాళ్లను పట్టించుకునే నాయకుడు సీఎం కేసీఆర్‌ అని అన్నారు మంత్రి కేటీఆర్‌. ధనవంతులను మరింత పెద్దవాళ్లను చేశారు ప్రధాని నరేంద్రమోడీ అని మండిపడ్డారు. మునుగోడు రోడ్డు షోలో ఆయన మాటాడుతూ, మీరు ఏ గట్టున ఉంటారో ఆలోచించుకోవాలంటూ రంగస్థలం సినిమా పాటను వాడుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక రెండు భావజాలాల మధ్య ఊగిసలాడుతోందని అన్నారు. పేదవాళ్లను పట్టించుకునే నాయకుడు సీఎం కేసీఆర్‌ అని తెలిపారు.14 నెలల్లో మునుగోడును బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. నారాయణపురం ప్రజలు ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాలి. మందు, మటన్‌ పెట్టగానే గందరగోళం కావొద్దు. ఎవరి వల్ల మన బతుకులు బాగుపడుతాయో ఆలోచించండి. మనది పేదల ప్రభుత్వం.. బీజేపీది పెద్దల ప్రభుత్వం. రైతు బంధు కావాలా.. రాబందు కావాలా.. ఆలోచించుకోండి అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img